News June 1, 2024

HYD: పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు సువర్ణ అవకాశం

image

సికింద్రాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర పేరిట ప్రత్యేక రైలు జూన్ 22వ తేదీన అందుబాటులో ఉంటుందని IRCTC తెలిపింది. ఒక వ్యక్తికి రూ.14,250 ఛార్జి ఉంటుందని, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తంజావూరు లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని పేర్కొంది. ఆసక్తి ఉంటే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG25 లింక్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. SHARE IT

Similar News

News September 21, 2024

HYD: ఇండోర్, లక్నోకు వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

News September 21, 2024

HYD: విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: సీఎండీ

image

నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 21, 2024

HYD: రూ.6,661 కోట్లతో నాగపూర్ జాతీయ రహదారి

image

హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌లోని 251KM హైవేను NHAI సంస్థ, హైవే ఇన్ఫ్రా స్ట్రక్చర్ ట్రస్ట్‌కు టోల్-ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ (TOT) మోడల్‌లో రూ.6,661 కోట్లకు కేటాయించినట్లుగా తెలిపింది. HYD నగరం నుంచి నాగపూర్, నాగపూర్ నుంచి HYD వెళ్లే వాహనదారుల నుంచి TOT మోడల్లో టోల్ ఛార్జీలను వసూలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.