News October 3, 2025

HYD: పెద్దనాన్న వేధింపుతో విద్యార్థిని సూసైడ్

image

సొంత పెద్దన్నాన అత్యాచార వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాలిలా.. కొంపల్లిలోని పోచమ్మ గడ్డలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరకగా పెద్దనాన్నే కాలయముడయ్యాడని తేలింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 3, 2025

సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.

News October 3, 2025

ప్రాక్టికల్స్ కోసం వెళ్లి MBBS విద్యార్థిని సూసైడ్

image

నెల్లూరు మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో శుక్రవారం ఉదయం MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని <<17902198>>ఆత్మహత్య <<>>చేసుకుంది. మృతురాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరుకు చెందిన సంజీవ రాయుడు, లక్ష్మీదేవి కుమార్తె బన్నెల గీతాంజలిగా గుర్తించారు. ఇటీవల ఊరికి వచ్చిన ఆమె.. ప్రాక్టికల్స్ ఉండటంతో నిన్న కాలేజీకి వెళ్లింది. ఇవాళ ఆత్మహత్య చేసుకుంది.

News October 3, 2025

NLG: మద్యం టెండర్‌లకు మందకొడిగా దరఖాస్తులు..!

image

మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నల్గొండ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. 154 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడం లేదు. 26వ తేదీ నుంచి నేటి వరకు 8 దరఖాస్తులే వచ్చాయి. పాత వారితోపాటు కొత్త వ్యక్తులు బరిలో ఉంటారని భావించినప్పటికీ దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.