News March 15, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News July 6, 2025
కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి

కామారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుంచి 1 వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News July 6, 2025
పెద్దేముల్: ‘చదువు మధ్యలో మానేసిన యువతకు అవకాశం’

చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుందని పెద్దేముల్ GHM సునీత పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో 25 ఓపెన్ స్కూల్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. పదో తరగతిలో చేరేందుకు 14 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు, ఇంటర్‌లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.