News April 14, 2025
HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

రెయిన్‌బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్‌నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్‌కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News November 8, 2025
జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.
News November 8, 2025
ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
మెదక్‌లో ముగిసిన జోనల్ స్థాయి మీట్

మూడు రోజులుగా మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో జరిగిన రాజన్న సిరిసిల్ల 11వ జోనల్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల పీడీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


