News October 19, 2025

HYD: పెళ్లి చేసుకుంటాని.. గర్భస్రావం చేయించాడు

image

భార్యా, పిల్లలున్న విషయం దాచిపెట్టి ప్రేమ పేరుతో మహిళను మోసం చేశాడో వ్యక్తి. మేడిపల్లి పోలీసుల వివరాలు.. చెంగిచర్ల మహిళ(35)కు ముగ్గురు పిల్లలున్నారు. 6 ఏళ్ల క్రితం భర్తకు విడాకులిచ్చింది. హబ్సిగూడలో పనిచేసే సమయంలో బోడుప్పల్‌ వాసి రాజేందర్(37)తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని, దగ్గరయ్యి గర్భవతికాగానే గర్భస్రావం చేయించాడు. భార్య, పిల్లలున్న విషయం దాచిపెట్టి మోసం చేశాడని PSలో ఫిర్యాదు చేసింది.

Similar News

News October 21, 2025

అనకాపల్లి జిల్లాలో ప్రముఖ శివాలయాలు

image

ఈనెల 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో పలు ప్రముఖ దర్శనీయ శివాలయాలు ఉన్నాయి.
➤ నర్సీపట్నం బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం
➤ పంచదార్ల ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయం
➤ ఉపమాక లక్ష్మణేశ్వర స్వామి ఆలయం
➤ దారమఠం దార మల్లేశ్వర స్వామి ఆలయం
➤ కళ్యాణపులోవ కళ్యాణ లింగేశ్వర స్వామి ఆలయం
➤ వాడ్రాపల్లి దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం
➤ అనకాపల్లి భోగలింగేశ్వర స్వామి ఆలయం

News October 21, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 21, 2025

ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ప్రసారభారతి<<>> 59పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/