News September 13, 2025
HYD: పెళ్లి సంబంధాల పేరుతో రూ.25 లక్షల మోసం.. అరెస్ట్

పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో మోసం చేసిన అనీశ్(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి, చివరికి అకౌంట్‌లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.
Similar News
News September 13, 2025
9 నెలల్లోపే ఆ స్థానాలకు ఉపఎన్నికలు: KTR

TG: తాము అధికారంలో ఉన్న సమయంలో గద్వాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని KTR అన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 22 నెలలు గడిచినా ఏమీ చేయలేదని మండిపడ్డారు. BRSలోనే ఉన్నానని చెబుతున్న గద్వాల MLA కృష్ణమోహన్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 9 నెలల్లోపే ఫిరాయింపు స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని గద్వాల సభలో అన్నారు.
News September 13, 2025
15న తిరుపతికి రానున్న మారిషస్ PM

మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగుళం ఈనెల 15న తిరుపతికి రానున్నారు. తిరుపతి సమీపంలోని రామాపురం బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
News September 13, 2025
మేడ్చల్: వామ్మో.. కరెంట్ బిల్లు చూసి షాక్..!

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్ సూరారం దొమ్మర పోచంపల్లి పరిధిలో వినియోగదారుడికి రూ.7 వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చి షాక్ అయ్యాడు. అధిక బిల్లు ఎందుకొచ్చిందని అధికారులను ప్రశ్నించాడు. ‘రెండు నెలలుగా అధిక బిల్లులపై కస్టమర్లు అడిగినా EE, మీటర్ రీడింగ్ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని బాధితుడు కోరాడు.