News August 10, 2025
HYD: పెళ్లైన గంటల్లోనే గుండెపోటుతో యువకుడి మృతి

వివాహమైన కొద్ది గంటల్లోనే ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. బడంగ్‌పేట్ లక్ష్మీదుర్గకాలనీకి చెందిన ఈవెంట్స్ మేనేజర్ విశాల్ కుమార్ (25)కు ఈ నెల 7న వివాహం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకోగానే విశాల్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గ్లోబల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News August 12, 2025
19న ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం

ఓయూ 84వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ వేడుకకు వర్సిటీ ఛాన్స్‌లర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్య అతిథిగా ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల బంగారు పతకాల గ్రహీతలు, 2023 నవంబర్ నుంచి ఈ నెల వరకు ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందిన వారికి ప్రదానం చేయనున్నారు.
News August 12, 2025
ఓయూ పీహెచ్‌డీ కోర్స్ వర్క్ పరీక్షల ఫలితాల విడుదల

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్‌డీ కోర్స్ వర్క్/ ప్రీ పీహెచ్‌డీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ఫ్యాకల్టీల పరిధిలోని పలు విభాగాల పీహెచ్‌డీ కోర్స్ వర్క్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News August 12, 2025
ఉస్మానియా యూనివర్సిటీ ఎంసీఏ పరీక్షల తేదీల ఖరారు

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు. SHARE IT