News January 3, 2025
HYD: పోలీసులకు ప్రత్యేక శిక్షణ: డీజీపీ
ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు టీజీఎస్పీలో చేరారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని చెప్పారు. వీళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామని, పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా బాక్సింగ్, క్రికెట్‌పై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది ఆశయంగా పెట్టుకున్నామన్నారు.
Similar News
News January 5, 2025
HYD: ఆ చెరువుల జాడే లేదు.. మింగేశారు..!
HYD సహా శివారులోని కొన్ని చెరువులను కబ్జాకోరులు కనీసం చెరువు జాడ దొరకకుండా మింగేశారు. NRSC ద్వారా 2014 తర్వాత అంతకు ముందు ఉన్న శాటిలైట్ చిత్రాలతో పలు విషయాలను వెల్లడించింది. 2014 వరకు ఆక్రమణ కాకుండా పుప్పాలగూడ చెరువు-9.25 ఎకరాలు, బుద్వేల్ 6.39, బాచుపల్లి 2.1, కుంట్లూరు 1.62 ఎకరాల చెరువులు ఉన్నాయని, కానీ.. 2014 తర్వాత పూర్తిగా జాడ లేకుండా కనుమరుగైనట్లు తెలిపింది.
News January 5, 2025
HYD: విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్‌పై ఫోకస్..!
HYD నగరంలోని OU, JNTUH, జయశంకర్ యూనివర్సిటీ, IIITH, IITH, HCU యూనివర్సిటీలో రీసెర్చ్‌పై విశ్వవిద్యాలయాల ఫోకస్ పెట్టాయి. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 2022-23 నుంచి ఇందుకు బాటలు పడ్డాయి. IITH-79.77 కోట్లు, HCU-65.09, IIITH-33.55, అగ్రికల్చర్ యూనివర్సిటీ-21.36, OU-24.75, JNTUH-28.83 కోట్ల సెర్చ్ గ్రాంట్లే ఇందుకు నిదర్శనం.
News January 5, 2025
HYD: రైతుద్రోహి సీఎం: కేటీఆర్
మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై Xలో మండిపడ్డారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాలో ప్రభుత్వం రైతునే కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్.. మోసానికి మారు పేరని పేర్కొన్నారు. ఢోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని రైతుద్రోహి సీఎం రేవంత్ అని రాసుకొచ్చారు.