News March 28, 2025

HYD: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

image

MMTSలో యువతిపై అత్యాచారయత్నం జరిగిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడం సవాలుగా మారుతోంది. బాధితురాలికి మరోసారి అనుమానితులను చూపించాలని పోలీసులు భావిస్తుండగా.. ప్రస్తుతం ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరా తీస్తున్నారు. కాగా.. గురువారం బాధితురాలి వాంగ్మూలాన్ని మళ్లీ రికార్డు చేశారు.

Similar News

News September 9, 2025

ఉమ్మడి RR ఏఎంసీ ఛైర్మన్‌ల గౌరవ అధ్యక్షుడిగా పెంటయ్య

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెంటయ్య గౌడ్ ఎన్నికయ్యారు. పలు మండలాల ఏఎంసీ ఛైర్మన్లు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్‌ల గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారందికీ ధన్యవాదాలు తెలిపారు.

News September 9, 2025

మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

image

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.

News September 8, 2025

RR: పింఛన్‌దారులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

image

అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పింఛన్ పెంచకుండా మోసం చేస్తున్నట్లు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పింఛన్‌దారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే పింఛన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.