News October 21, 2025

HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

image

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్‌లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్‌లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.

Similar News

News October 21, 2025

రాయికల్: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

image

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం సింగరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రభుత్వం అందజేస్తున్న ఇసుక లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 21, 2025

రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 5,810 NTPC పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. వయసు పోస్టులను బట్టి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పూర్తై ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 21, 2025

మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా: కలెక్టర్

image

మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అదృశ్యమైన 670 మంది బాలికలను ఒక్క నెలలోనే గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారన్నారు. ఆపరేషన్ సేఫ్ డ్రైవ్ నిర్వహించి 25,807 కేసులు నమోదు చేసి రూ.40.62 లక్షల జరిమానా విధించారని అన్నారు.