News October 28, 2025
HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT
Similar News
News October 28, 2025
వనపర్తి: రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు పంట కోతలు చేపట్టకుండా వాయిదా వేసుకునేలా సూచించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అలాగే ఇప్పటికే పంట కోత చేపట్టిన రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆరబోసుకునే విధంగా తగు సూచనలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 28, 2025
రాత్రి 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

బాపట్ల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అధిక వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
News October 28, 2025
మంచిర్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష

భీమారం మండలంలో హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించింది. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపిన వివరాలు.. శంకరమ్మ అనే మహిళపై సమ్మయ్య,లింగయ్య అనే నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు తరలించారు. మంచిర్యాల అదనపు సహాయ సేషన్స్ న్యాయమూర్తి రామ్మోహన్ రెడ్డి సాక్షుల వాంగ్మూలాలు,ఆధారాలు పరిశీలించి మంగళవారం తీర్పు వెలువరించారు.


