News December 9, 2025

HYD: ప్చ్.. ఈ సమ్మర్‌లో బీచ్‌ కష్టమే!

image

రూ.225 కోట్లతో 35 ఎకరాల్లో కొత్వాల్‌గూడలో మొట్టమొదటి కృత్రిమ బీచ్‌ ప్రతిపాదన ఈ వేసవికి కూడా కలగానే మిగిలేలా ఉంది. వేవ్ టెక్నాలజీతో కూడిన మ్యాన్‌మేడ్ సరస్సు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, అడ్వెంచర్స్, థియేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.15,000 కోట్ల పర్యాటక సామర్థ్యాన్ని పెంచేలా DEC నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, వచ్చే ఏడాది మార్చిలోనే పనులు ప్రారంభంకానున్నట్లు సమాచారం.

Similar News

News March 3, 2026

హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది!

image

హోలీ పండుగ, గ్రహణం ఉండటంతో నగరంలో రోడ్లు, బస్సులు వెలవెలబోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్ల వద్దే కుటుంబాలతో పండుగ జరుపుకోవడంతో బయట రాకపోకలు తగ్గాయి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు బస్సుల్లో ప్రయాణికులు లేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రంగుల సందడి కాలనీలకే పరిమితమైంది. బండ్ల పొగ లేక నగరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.

News March 3, 2026

‘బ్లాక్‌చైన్ బస్తీ’గా పాతబస్తీ?

image

చార్మినార్ పరిసరాల్లోని యువత ఇప్పుడు బిర్యానీ కబుర్ల కంటే ‘బ్లాక్‌చైన్’ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న ఇంటర్నెట్ సెంటర్లలో డిజిటల్ లెడ్జర్స్, క్రిప్టో కోడింగ్‌పై వర్క్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. విదేశీ ప్రాజెక్టుల కోసం ఇక్కడి కుర్రాళ్లు ఫ్రీలాన్సింగ్ చేస్తూ భారీగా సంపాదిస్తూ పాతబస్తీ యువత డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది భవిష్యత్తులో HYDకు కొత్త గుర్తింపు తీసుకురావడం ఖాయం.

News March 3, 2026

GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

image

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.