News April 8, 2024
HYD ప్రజలకు GOOD NEWS.. తగ్గనున్న ఎండ!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712556923522-normal-WIFI.webp)
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ‘తెలంగాణ వెదర్ మెన్’ X వేదికగా గుడ్ న్యూస్ తెలిపింది. వడగాలులు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. నేడు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలియజేసింది. రాబోయే వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి, ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.
Similar News
News December 27, 2024
HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735239666816_52434120-normal-WIFI.webp)
ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.
News December 27, 2024
REWIND: హైదరాబాదీల మనసు గెలిచారు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735263534986_1212-normal-WIFI.webp)
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్‌ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.
News December 27, 2024
HYD: చిరుజల్లులు కానీ.. అంతకుమించి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735253443644_15795120-normal-WIFI.webp)
HYD,RR,MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి అనేకచోట్ల చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాయత్రినగర్‌లో-21 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. HYD షేక్‌పేట-7, ఓయూలో-6, హిమాయత్‌నగర్-5.8, ఫిలింనగర్-5, ఉప్పల్-4.8, ఆసిఫ్‌నగర్-4.8, అంబర్‌పేట-4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేటి నుంచి వర్షం పడకపోవచ్చని తెలిపింది.