News March 19, 2024

HYD: ప్రజాపాలన సేవా కేంద్రాలు బంద్..

image

HYDలో గృహ జ్యోతి పథకానికి అర్హులైనప్పటికీ జీరో బిల్ రాని వారి సమస్యలను పరిష్కరించడం కోసం GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా, ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రజా పాలన సేవా కేంద్రాలు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, మల్కాజిగిరి డీసీ రాజు తెలిపారు.

Similar News

News September 5, 2025

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

image

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.

News September 5, 2025

పెరిగిన బిజినెస్.. GHMCకి భారీ ఆదాయం

image

మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

News September 5, 2025

HYD: ఈనెల 6న ట్రాఫిక్ ఆంక్షలు

image

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా HYD నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 6న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. బాలాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వైపు సాగుతాయని, ఈ ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదన్నారు.