News November 19, 2025

HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

image

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News November 19, 2025

ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

image

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్‌లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.

News November 19, 2025

MNCL: తీన్మార్ మల్లన్నతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల భేటీ

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో గురువారం ఇటీవల నూతనంగా నియమితులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భేటీ అయ్యారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు.

News November 19, 2025

సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్‌లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.