News August 24, 2024
HYD: ప్రజావాణికి 1150 అర్జీలు

బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1150 అర్జీలు అందాయి. ఎస్సీ సంక్షేమం-610, విద్యుత్ శాఖ, సింగరేణి-115, పౌరసరఫరాల శాఖ-113, మైనారిటీ సంక్షేమం-85, రెవెన్యూ-69, ఇతర శాఖలకు 158 వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారిణి దివ్య అర్జీలు స్వీకరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
Similar News
News February 28, 2026
హైదరాబాద్‌లో ఇక ఒకే చట్టం: సీఎం ఆదేశాలు

ఓఆర్ఆర్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్షించారు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేసి, అనుమతులు, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తేవాలని చెప్పారు.
News February 28, 2026
HYD: ఏ ఇంజెక్షన్ ఎక్కడ వేస్తారో తెలుసా?

ఒకచోట ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మరో చోట ఇవ్వడంతో అస్వస్థతకు, ఫ్యూయిడ్‌లో వేరే మందు కలపడంతో కొందరు ప్రాణాలు విడిచిన ఘటనలు నగరంలో అనేకం. ఇంజెక్షన్లపై ఎక్స్‌పైరీతో పాటు సీసా మీద ఉండే ఈ పదాలతో ఇంజెక్షన్ ఎక్కడ వేయాలో తెలుసుకోవచ్చు.
IV అని ఉంటే నరాలకు, IM- కండరానికి, ID- చర్మం మీద, SC- చర్మం కింది లేయర్‌పై మాత్రమే వేయాలి. IO- బోన్ మ్యారోకి(ప్రాణాపాయ స్థితిలో అవలంభిస్తారు) వేస్తారు.
నోట్: కేవలం సమాచారం కోసమే
News February 28, 2026
HYD: ‘గాలి’ రిపేర్లు.. ‘అసలు’ బిల్లులు!

భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ అవినీతి మురికిని కడగాల్సి ఉంది.


