News June 28, 2024

HYD: ప్రజావాణి కార్యక్రమానికి 494 దరఖాస్తులు

image

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేకాధికారిణి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News September 23, 2024

సికింద్రాబాద్‌లో పురాతన అద్భుతమైన టెంపుల్

image

సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని 1847 నాటి పురాతన పర్సి ఫైర్ టెంపుల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ సైకిల్ లిస్టులో బృందం టెంపుల్ వెళ్లి సందర్శించి, ఆనాటి చరిత్ర ఆనవాళ్ల గురించి తెలుసుకున్నారు. పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన పేస్తోంజి, విక్కాజి మెహర్జీలు HYD, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

News September 22, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

East HYD‌కు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట, మీర్‌పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలు‌లతో కూడిన‌ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667‌ నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News September 22, 2024

HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.