News February 25, 2025
HYD: ప్రతినిధులే కబ్జాలు చేస్తున్నారు: హైడ్రాకు ఫిర్యాదు

పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించి పలు లే ఔట్లలో కేటాయించిన స్థలాలను అక్కడి కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే కబ్జా చేస్తున్నారని పలువురు పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో హైడ్రా ఆడిషనల్ డైరెక్టర్ ఫైర్ పాపయ్య ఫిర్యాదులు స్వీకరించారు. కాలనీ రహదారులను కూడా వదలకుండా ముందుకు జరిగి ప్రహరీలు నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
HYDలో పెరిగిన హలీం ధరలు

ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.
News February 25, 2025
ADB: 3 రోజులు పత్తి కొనుగోలు బంద్

ఈ నెల 26, 27, 28 తేదీల్లో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలిపారు. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 28న అమావాస్య ఉన్నందున కొనుగోళ్లు జరగవని వెల్లడించారు. మార్చి 1నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
News February 25, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు మస్క్ వార్నింగ్.. ట్రంప్ మద్దతు

అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులకు డోజ్ చీఫ్ మస్క్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత వారం చేసిన పనులను రెండు రోజుల్లో చెప్పాలని, లేకపోతే రిజైన్ చేయాలని ఎక్స్‌లో పోస్టు పెట్టగా దాన్ని పట్టించుకోవద్దని ట్రంప్ యంత్రాంగం భరోసానిచ్చింది. అయితే మస్క్ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతిచ్చారు. ఉద్యోగులు చేస్తున్న పని గురించి మస్క్ ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానం ఇవ్వాలని వారికి సూచించారు.