News November 20, 2025
HYD: ‘ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పని చేయాలి’

HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ & సోషల్ మీడియా విభాగాల సంయుక్త సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు. లీగల్ మార్గదర్శకాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయడం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 21, 2025
IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.
News November 21, 2025
దానం డిసీషన్.. ఓవర్ టూ ఢిల్లీ

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలకు సంబంధించి MLA దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గతంలోనే స్పీకర్ కార్యాలయం దానంకు నోటీసులు అందజేసింది. ఆయన స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు పంపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ పెద్దలతో దానం చర్చించి నిర్ణయం తీసుకుంటారని టాక్.


