News August 26, 2024
HYD: ప్రతీ స్కూల్ నుంచి 5మందికి గొప్ప అవకాశం

HYDలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యా సంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్‌స్పైర్ అవార్డు మానక్ 2024-25 నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 4, 2025
HYD: ఆపండయ్యా మీ రాజకీయం.. ‘ఆడ’పిల్లలను ఆదుకోండి!

మీర్జాగూడ ఘటనపై నేతల హంగామా తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతదేహాల మధ్య హైవే సాంక్షన్ చేశామని ఒకరు, నిధులు మంజూరు చేశామని మరొకరు, పనులు మొదలుపెట్టిందే మేమని ఇంకొకరు గొప్పలు చెప్పుకున్నారు. ‘ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పేద కుటుంబం పెద్దలను కోల్పోయింది. ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. గతాన్ని మార్చలేము. యాలాలలోని హాజీపూర్‌లో అనాథలైన <<18187789>>భవానీ, శివాలీ<<>>ని ఆదుకోండి’ అంటూ ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
News November 4, 2025
HYD: పిల్లలకు ఇక నుంచి టిఫిన్!

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లోని 3,253 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ఉదయం అల్పాహార పథకం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.50 లక్షల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంలో మెరుగుదలతో పాటు పాఠశాల హాజరును పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మెనూలో ఇడ్లీ, ఉప్మా, రాగి జావ, అటుకుల ఉప్మా వంటి వంటకాలు ఉండనున్నాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.


