News November 27, 2024
HYD: ప్రధాని మోదీతో కేంద్ర మంత్రులు, ఎంపీలు
రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని రాజకీయ అంశాల గురించి చర్చించినట్లు వారు తెలిపారు.
Similar News
News November 28, 2024
HYD: జంతువుల వెచ్చదనానికి ఏర్పాట్లు
సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.
News November 28, 2024
HYDలో మరో ముఠా.. ప్రజలు జాగ్రత్త..!
HYD ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా వచ్చిందన్నారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు బట్టలు అమ్మేవారిగా, చౌకైన వస్తువులను విక్రయించే వారిగా కాలనీల్లోని గృహాలు, షాపుల్లో రెక్కీ నిర్వహిస్తారని శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
News November 27, 2024
HYD: ఫిబ్రవరిలో 300 మందితో బర్డ్ సర్వే
వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.