News April 8, 2025

HYD: ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు: కవిత

image

అనుముల ఇంటెలిజెన్స్ వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదన్నారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినప్పటికీ వివరాలు వెల్లడించలేదన్నారు.

Similar News

News April 17, 2025

HYD: స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ

image

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. దీంతో స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

News April 17, 2025

హైదరాబాద్‌లో ఆందోళనలు.. పోలీసుల అప్రమత్తం!

image

నగరంలో కొద్దిరోజులుగా వరుస ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ముస్లిం సంఘాలు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. SMలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిపై సైతం పోలీసులు నిఘా పెట్టారు.

News April 16, 2025

రంగారెడ్డి: జడ్జీలను ట్రాన్ఫర్ చేస్తూ ఉత్తర్వులు

image

రంగారెడ్డి జిల్లాలో పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో కర్ణకుమార్ రానున్నారు. 1, 2, 4, 9, 11, 12 జిల్లా అదనపు న్యాయమూర్తులను హనుమకొండ, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరికి బదిలీ అయ్యారు.

error: Content is protected !!