News April 11, 2025

HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

image

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.

Similar News

News November 9, 2025

గుంజీలు తీయడం పనిష్మెంట్ కాదు!

image

గుంజీలు తీయడం అంటే పనిష్మెంట్ అనుకుంటారు. కానీ వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గుంజీలు తీస్తే పొత్తి కడుపు, పేగు కండరాలు బలంగా తయారవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే వాళ్లు రోజూ 30 గుంజీలు తీస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని కొవ్వు కూడా తేలికగా కరిగి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. SHARE IT.

News November 9, 2025

వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్

image

వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. కాగా వీకేండ్ కావడం, రెండు రోజుల సెలవుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగి వచ్చి సందడి చేస్తున్నారు.

News November 9, 2025

GWL: టీబీ డ్యామ్ ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు సాగునీరు

image

కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు నూతన గేట్లు అమర్చేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని తెలిపారు. రబీలో క్రాప్ హాలిడే ప్రకటించి కొత్త గేట్లు అమర్చుతామని తెలిపారు. విషయాన్ని ఆయకట్టు రైతులు గ్రహించి సహకరించాలన్నారు. ఈ విషయమై 3 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.