News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్‌నుమా

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్‌గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్‌ను లీజ్ తీసుకుంది.
Similar News
News December 15, 2025
మెస్సీ టూర్ గందరగోళం.. కలకత్తా హైకోర్టులో PIL

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో ఏర్పడిన గందరగోళంపై హైకోర్టులో PILలు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు వచ్చేవారం విచారిస్తామని పేర్కొంది. LOP సువేందు అధికారి తదితరులు వీటిని దాఖలు చేశారు. నిష్పాక్షిక దర్యాప్తుకోసం CBI, ED, SFIOతో విచారించాలని కోరారు. కాగా మిస్‌మేనేజ్మెంటు, స్టేడియంలో విధ్వంసం ఘటనలపై CM మమత రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో విచారణకు ఆదేశించడం తెలిసిందే.
News December 15, 2025
ఎస్.కోట సబ్ జైలును తనిఖీ చేసిన ప్రధాన న్యాయమూర్తి

ఎస్.కోట సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది లేదా తోటి ఖైదీలు వివక్ష చూపరాదని, అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఖైదీలను ఉద్దేశించి నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా మారాలని హితవు పలికారు.
News December 15, 2025
102 మంది సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపర్చిన వారే: నరేష్ జాదవ్

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నదని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మొత్తం 156 గ్రామ పంచాయతీ స్థానాల్లో 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని, దీంతో ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


