News November 19, 2025
HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Similar News
News April 5, 2026
VFXపై విమర్శలు కరెక్ట్ కాదు: హృతిక్ రోషన్

సినిమాల్లోని VFXను కనీస అవగాహనతో విమర్శించాలని ఆడియన్స్‌కు హీరో హృతిక్ రోషన్ సూచించారు. ‘మనం ఎన్నడూ చూడని వాటిని రామాయణ, కల్కి, బాహుబలి వంటి సినిమాలతో మేకర్స్ చూపిస్తున్నారు. ఎంతో ఖర్చు చేస్తూ కష్టపడుతున్నారు. VFXలో చాలా స్టైల్స్ ఉంటాయి. మేకర్స్ ఎంచుకున్న స్టైల్ మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇక నుంచి VFX కథకు సరిపోయిందా? మేకర్స్ తాము అనుకున్నది చూపించారా అని కూడా ఆలోచించండి’ అని SMలో పోస్ట్ పెట్టారు.
News April 5, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News April 5, 2026
ఏలూరు జిల్లాలో పలువురు SIల బదిలీ

ఏలూరు జిల్లాలో పలువురు SIలు బదిలీ అయ్యారు. వీరిలో క్రాంతిప్రియ పీసీఆర్, ఎస్.రామకృష్ణ డీసీఆర్బీ నుంచి ఏలూరు వన్ టౌన్, దుర్గాప్రసాద్ ఏలూరు వన్ టౌన్ నుంచి ట్రాన్స్కో, SSS పవన్ కుమార్ పోలవరం నుంచి కలిదిండి, వల్లి.పద్మ సైబర్ సెల్ నుంచి తడికలపూడి, చెన్నారావు తడికలపూడి నుంచి బుట్టాయిగూడెం, దేవసుధ డీసీఆర్బీ నుంచి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు SP ఆదేశాలు జారీ చేశారు.


