News November 19, 2025

HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

image

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Similar News

News April 14, 2026

GNT: న్యూడ్ వీడియో కాల్స్ గుట్టురట్టు.. ఇద్దరు మహిళల అరెస్ట్!

image

గుంటూరు(D) తెనాలిలోని చెంచుపేట కేంద్రంగా సాగుతున్న న్యూడ్ వీడియో కాల్స్ దందా కలకలం రేపుతోంది. ఓ యాప్ వేదికగా నగదు చెల్లించిన వారికి మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో చెంచుపేటకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అశ్లీల దందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News April 14, 2026

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

News April 14, 2026

భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో అత్యధికంగా 42.8℃, సారంగాపూర్‌లో 42.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురం, సిరిసిల్లలో 42.5℃, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి 42.4, గంగాధరలో 42.1, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి 41.7, ఆకెనపల్లిలో 41.6℃ ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. తీవ్రమైన ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.