News September 12, 2025

HYD: ప్రిజన్స్ స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణకు తొలి పతకం

image

ఆల్ ఇండియా ప్రిజన్స్ స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణకు తొలి పతకం లభించింది. HYD పోలీస్ అకాడమీలో జరిగిన 7వ క్రీడలకు 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల జైలు సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన ప్రతాప్ రజత పతకం సాధించారు. జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రత్యేక శిక్షణ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కోచ్ సాయి రెడ్డిని ప్రశంసించారు.

Similar News

News March 15, 2026

కొత్తగూడెం: ఇది కదా హిందూ-ముస్లిం ఐక్యత అంటే..

image

కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీలో గణేశ్ ఆలయ పూజారి హరగోపాల్ శర్మ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాసాలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా పాటించే ముస్లింలను సాయంత్రం ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక వంటకాలు వడ్డించారు. హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పూజారి శర్మను అభినందించారు. పరస్పర సౌహార్దానికి ఇది మంచి ఉదాహరణగా నిలిచింది.

News March 15, 2026

ఖమ్మంలో సౌర ప్లాంట్లకు 31 వరకు దరఖాస్తులు

image

సాగుకు పనికిరాని, నీటి వనరులు లేని భూముల్లో రైతులు పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్కో మేనేజర్ పి.అజయ్‌కుమార్ తెలిపారు. రైతులు సమయానికి దరఖాస్తు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం పొందవచ్చని తెలిపారు.

News March 15, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గత వారం KG స్కిన్ లెస్ ₹290-300 ఉండగా, ఇవాళ రూ.350 వరకు అమ్ముతున్నారు. APలోని పలు ప్రాంతాల్లో ₹315-320గా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి తగ్గడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.