News April 14, 2024
HYD: ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ప్రియుడి ఆత్మహత్య

ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD సూరారం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్ వాసి తన్వీర్ ఖాన్(27)కు మూడేళ్ల క్రితం వివాహమవగా బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చి దయానంద్ నగర్‌లో ఉంటున్నాడు. కాగా పెళ్లికి ముందు అతడు ప్రేమించిన యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. విషయం తెలిసి తన్వీర్ ఉరేసుకుని చనిపోయాడు. శనివారం కేసు నమోదైంది.
Similar News
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. HYDలో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
HYD: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో HYD, RR, MDCL జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.