News December 2, 2025

HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

image

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్‌కు చెందిన ధనుంజయ్‌‌‌‌‌‌ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్‌ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Similar News

News April 2, 2026

‘Floccinaucinihilipilification’ అంటే ఏంటి?

image

నిర్మలా సీతారామన్‌పై దాఖలైన పరువు నష్టం దావాను కొట్టివేస్తూ ఢిల్లీ కోర్టు వాడిన ‘Floccinaucinihilipilification’ పదం ఇప్పుడు ట్రెండవుతోంది. 29 అక్షరాలున్న ఈ పదానికి ‘విలువలేనిది’ లేదా ‘నిరుపయోగమైనది’ అని అర్థం. ఆప్ నేత సోమనాథ్ భారతీ భార్య వేసిన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ కోర్టు ఈ పదాన్ని వాడింది. పొడవుగా ఉండడం, పలకడానికి కష్టంగా ఉండడంతో రోజువారీ సంభాషణల్లో దీన్ని ఉపయోగించడం లేదు.

News April 2, 2026

అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: టీసీ వరుణ్

image

అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేక నిప్పులు కక్కుతున్నారని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ మండిపడ్డారు. పబ్జీ గేమ్ స్ఫూర్తితో రాజధానిపై వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పటిష్ఠ నాయకత్వంలోనే రాజధాని అజేయంగా నిలిచిందన్నారు. దీనికి మద్దతు తెలిపిన పార్టీలకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

News April 2, 2026

అమరావతి బిల్లుకు BRS మద్దతు

image

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో BRS మద్దతు తెలిపింది. తమ పార్టీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ స్వయంగా వెళ్లి రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.