News December 15, 2024
HYD: ప్రేమ పెళ్లి.. భార్యను అడవిలో వదిలేసిన భర్త!

భార్యను అడవిలో వదిలివెళ్లాడో భర్త. పూర్తి వివరాలు.. అల్వాల్‌లో ఉండే విక్రమ్ రబియాను DEC 4న ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో కాపురం పెట్టిన వీరి మధ్య గొడవలు జరగడంతో HYDకి వచ్చేశారు. ఇక్కడా గొడవ జరగడంతో రబియా మాత్రలు మింగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన భర్త ఆమెను సిద్దిపేట జిల్లాలోని అడవిలో వదిలేశాడు. స్థానికులు గమనించి రబియాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
Similar News
News February 20, 2026
రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.
News February 20, 2026
HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.