News February 3, 2026
HYD: ‘ప్రైవేట్’ ప్లాన్.. లాస్ట్ మినిట్‌లో చేతులెత్తేస్తారు

నగరంలో కొన్ని ప్రైవేటు్ ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఇన్ పేషెంట్లకు చికిత్స చేశాక పరిస్థితి చేయి దాటిపోతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. రూ.లక్షలు లాగేసిన తర్వాత.. ‘రోగి పరిస్థితి బాగాలేదు.. సర్కారు ఆస్పత్రికి వెళ్లండి’ అని చెబుతున్నారు. రోగుల మరణాలు తమ ఆస్పత్రి రికార్డులో ఉండొద్దనే ఈ ప్లాన్ వేస్తున్నారు.
Similar News
News February 4, 2026
HYD శివారులో ఎలక్షన్స్.. పూర్తి వివరాలు!

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాజధాని చుట్టు పక్కల ఉన్న మున్సిపాలిటీలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఎల్లంపేట (24 వార్డులకు 92 అభ్యర్థులు), అలియాబాద్ (20 వార్డులకు 83 అభ్యర్థులు), ఎంసీపల్లి(24 వార్డులకు 83 మంది) ఉన్నారు. ఇక షాద్‌నగర్‌లో 28W, 93C, చేవెళ్ల (18W, 59C), శంకర్‌పల్లి(15W, 57C), మొయినాబాద్(26W, 92C), ఇబ్రహీంపట్నం 24W, 83C, ఆమన్‌గల్ 15 వార్డులు, 54 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
News February 4, 2026
HYD: ఒక్క ఓటు చీలోద్దు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలని, రోజువారీ రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశించారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించి, పాత- కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్క ఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడుతూ, అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంచేశారు.