News September 10, 2025
HYD: ప్రైవేట్ భూముల రోడ్ల జోలికి హైడ్రా వెళ్లదు: రంగనాథ్

ప్రైవేట్ భూముల వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ‘చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. దళారీల మాయ మాటలు నమ్మవద్దని, వారి చేతిలో మోసపోవద్దని బుధవారం హైడ్రా విజ్ఞప్తి చేసింది.
Similar News
News September 11, 2025
HYD: రూ.25 లక్షలతో ఓలా డ్రైవర్ పరార్

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓలా కార్ డ్రైవర్ రూ.25 లక్షల నగదుతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు సికింద్రాబాద్ నుంచి బాలానగర్ బ్రాంచ్‌కు డబ్బులు తీసుకొస్తున్నారని, మ.2 గంటల సమయంలో బ్యాంక్ సిబ్బంది కారులో నుంచి దిగిన వెంటనే డ్రైవర్ పెట్టెతో ఉడాయించాడన్నారు. బ్యాంక్ ఉద్యోగుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
News September 11, 2025
HYD: బతుకమ్మ పండగ జర్నీకి ఇబ్బంది ఉండొద్దు: DRM

బతుకమ్మ, దసరా పండగలను దృష్టిలో ఉంచుకుని HYD సికింద్రాబాద్ రైల్వే DRM డాక్టర్ గోపాలకృష్ణన్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లకు ఆర్టీసీ సహకరించి సరిపడా బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను కోరారు.
News September 11, 2025
HYD: ‘G.O.46 సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి KTR సార్..!’

రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వద్దకు వెళ్లారు. G.O.46 బాధితులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థులు అన్నారు. కొన్ని నెలలుగా ఈ విషయంపై పోరాడుతున్నట్లు పోరాట సాధన సమితి సభ్యులు నవీన్ పట్నాయక్, శింబు, వంశీ, ఆకాశ్, శంకర్ తెలిపారు.