News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
Similar News
News April 8, 2026
HYD: కల్తీ మామిడిపండ్లను పసిగట్టండిలా..!

సహజంగా పండిన మామిడిపండు ఆకుపచ్చ, పసుపు రంగు మిశ్రమంలో కన్పిస్తుంది. ఇది సువాసన వెదజల్లడంతో పాటు పుల్లగా, తియ్యగా ఉంటుంది. నీళ్లలో వేస్తే మునిగిపోతోంది. రసాయనాలతో మగ్గించిన పండుకు ఎలాంటి వాసన ఉండదు. తింటే చప్పగా ఉంటుంది. ఇది పూర్తిగా పసుపుపచ్చ రంగులో కన్పిస్తుంది. నీటిలో వేస్తే ఇట్టే తేలిపోతుంది. కాగా వ్యాపారులు మోతాదుకు మించి రసాయనాలు వినియోగించినట్లు తేలితే రూ.7లక్షల జరిమానా, 3 ఏళ్ల జైలు ఉంటుంది.
News April 8, 2026
HYD: రూ.1200 కోట్ల భూమి కాపాడిన హైడ్రా

HYD గచ్చిబౌలి IT కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలోని ప్రభుత్వ జాగాను కాపాడింది. శేరిలింగంపల్లి ఖానామెట్‌లోని సర్వే నం.55లోని 8 ఎకరాలకుపైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన సంబంధిత అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. దీని విలువ రూ.1200కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
News April 8, 2026
చెన్నైకీ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం: CMDA

తెలంగాణలోని హైడ్రా పనితీరును అధ్యయనం చేసేందుకు చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించింది. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, వరద నియంత్రణలో హైడ్రా అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని ఈ బృందం కొనియాడింది. చెన్నై వంటి నగరాల్లోనూ ఇలాంటి సమన్వయ వ్యవస్థ ఏర్పాటు అవసరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


