News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
Similar News
News April 15, 2026
పెద్దపల్లి: PM ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానం

జిల్లాలోని అర్హత కలిగిన యువత PM ఇంటర్న్ షిప్-3 ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి కీర్తి కాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలలో చెల్లింపులతో కూడిన ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. 6 లేదా 9 ఇంటర్న్ షిప్ ఉంటుందని, 18 – 25 సం. వయసుగల వారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 1800116090 టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించాలన్నారు.
News April 15, 2026
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News April 15, 2026
ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.


