News November 19, 2025

HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

image

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.

Similar News

News April 13, 2026

ములుగు: ‘ఇండ్ల గణనను పారదర్శకంగా చేపట్టాలి’

image

జన గణనలో భాగంగా మే 11 నుంచి చేపట్టనున్న ఇండ్ల గణనను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన రాష్ట్ర సంచాలకురాలు భారతి హోలికేరి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ములుగు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అధికారులు పాల్గొన్నారు. ఇండ్లను బ్లాక్‌ల వారీగా విభజించి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్‌లను నియమించాలని సూచించారు. మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

News April 13, 2026

కామారెడ్డి: Arrive Alive కార్యక్రమాలకు శ్రీకారం

image

కామారెడ్డి జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు “Arrive Alive” కార్యక్రమాలను ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ కలెక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాదచారులు, వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

News April 13, 2026

మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం!

image

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ICC రికార్డు స్థాయిలో ₹82 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించింది. 2024తో పోలిస్తే ఇది 10% అధికం. విజేతగా నిలిచిన టీమ్‌కు ₹21.9 కోట్లు, రన్నరప్‌కు ₹10.9 కోట్లు దక్కనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం ₹2.3 కోట్ల గ్యారంటీ ప్రైజ్ మనీ లభించనుంది. జూన్ 12 నుంచి 12 జట్లతో జరగనున్న ఈ మెగా టోర్నీలో మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.