News November 19, 2025

HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

image

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.

Similar News

News April 2, 2026

ఉమ్మడి ప.గో.లో పెరిగిన వార్డుల సంఖ్య

image

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో కొన్ని మున్సిపాలిటీల స్వరూపం మారనుంది.
నిడదవోలు 28 నుంచి 32
జంగారెడ్డిగూడెం 29 – 32
నరసాపురం 31- 36
ఆకివీడు 20- 28
నూజివీడు 32- 36

News April 2, 2026

నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.

News April 2, 2026

వికారాబాద్‌: రూ.200.. ఇంటర్‌‌ అడ్మిషన్లు

image

వికారాబాద్, కొడంగల్, దోమ KGBVలలో వచ్చే విద్యాసంవత్సరానికి ఇంటర్ MPC, BIPC, CEC ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 15 వరకు TGRJC సైట్‌లో రూ.200 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలు సైట్‌లో చూడవచ్చు.