News March 8, 2025

HYD: ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

image

ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు అమర్ దీప్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News March 9, 2025

HYD: ఈనెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

News March 9, 2025

PMJ జ్యువెల్స్ – అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్‌ శారీ, జ్యువెలరీ ఎగ్జిబిషన్

image

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జువెల్స్ హైదరాబాద్‌లోనే అతిపెద్ద వెడ్డింగ్ & హాఫ్ శారీ ఎగ్జిబిషన్‌ను తాజ్ కృష్ణలో శుక్రవారం ప్రారంభించింది. ఇందులో సంప్రదాయం, ఆధునికత కలబోతతో కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 20,000+ ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు మేనేజ్మెంట్ తరపున ప్రతీక్ జైన్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్ ఆదివారం ముగియనుందని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 9, 2025

HYD: మెట్రోలో గుండె తరలించిన వైద్యులు

image

HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్‌లో మెట్రో‌ ఎక్కి జూబ్లీహిల్స్‌లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు.

error: Content is protected !!