News November 27, 2024

HYD: ఫిబ్రవరిలో 300 మందితో బర్డ్ సర్వే

image

వచ్చే ఫిబ్రవరిలో నగరంలో బర్డ్ సర్వే జరగనుంది. నగరవ్యాప్తంగా 300 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పార్కులు, చెరువులు, అటవీ ప్రాంతాల్లో పక్షులను గుర్తిస్తారు. నగరంలో పక్షుల సంఖ్యను తెలుసుకోవడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు పక్షులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సర్వే ద్వారా తెలుస్తుందని నిర్వాహకులు ఫరీదా పేర్కొన్నారు.

Similar News

News July 9, 2025

నేడే పురాణహవేలీలో పాత కోత్వాల్ ఆఫీస్ ప్రారంభం

image

పురాణహవేలీలోని పాత కోత్వాల్ కార్యాలయం నేడే ప్రారంభం కానుంది. దీనిని CP ఆనంద్ చొరవతో అద్భుతంగా పునరుద్ధరించారు. ఆఫీస్ నిర్మాణ పైకప్పు కూలిన సమయంలో కూల్చడానికి సిద్ధం చేశారు. ఆ వారసత్వాన్ని కాపాడాలని తలపెట్టిన CP, స్పాన్సర్ గ్రీన్కో CMD అనిల్ సహకారంతో డిసెంబర్ 2022లో పునరుద్ధరణ ప్రారంభించారు. నాడు ఆయన బదిలీతో పనులు ఆగినా, CPగా తిరిగి వచ్చాక పున:ప్రారంభించి పూర్తి చేశారు

News July 9, 2025

HYD: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడితే సామాజిక సేవ

image

ఫూటుగా మద్యం తాగి బండ్లు నడుపుతూ పట్టుబడిన వారు సామాజిక సేవచేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు. డ్రంక్ & డ్రైవ్‌లో చిక్కిన ముగ్గురికి మేడ్చల్ అత్వెల్లి కోర్టులో 2రోజులు, సుచిత్ర కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్, అవేర్నెస్, రోడ్లు మరమ్మతులులో పాల్గొనాలని ఆదేశించిందని తెలిపారు. శిక్ష అమలులో భాగంగా నిందితులు సుచిత్ర కూడలిలో పనులు చేశారు.

News July 9, 2025

HYD: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

image

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు ప్రవీణ్‌కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో ప్రవీణ్ కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.