News December 26, 2024

HYD: ఫిబ్రవరి 3న లక్ష డప్పుల మహాప్రదర్శన

image

ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్‌లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.

Similar News

News February 28, 2026

HYD: రేపటి నుంచి కష్టమే.. జర పైలం!

image

మార్చిలో ప్రారంభమయ్యే ఎండలు నగరంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతో నీటి అవసరాల సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మంచిదని సూచించారు. HYDలో వడగాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు కచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాలని తెలిపారు.

News February 28, 2026

హైదరాబాద్‌లో ఇక ఒకే చట్టం: సీఎం ఆదేశాలు

image

ఓఆర్ఆర్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఒకే చట్టం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్షించారు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపకల్పన చేసి, అనుమతులు, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ చట్టం ఆధారంగా నిర్వహించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని శాఖల రోడ్లను MAUD పరిధిలోకి తేవాలని చెప్పారు.

News February 28, 2026

HYD: ఏ ఇంజెక్షన్ ఎక్కడ వేస్తారో తెలుసా?

image

ఒకచోట ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మరో చోట ఇవ్వడంతో అస్వస్థతకు, ఫ్యూయిడ్‌లో వేరే మందు కలపడంతో కొందరు ప్రాణాలు విడిచిన ఘటనలు నగరంలో అనేకం. ఇంజెక్షన్లపై ఎక్స్‌పైరీతో పాటు సీసా మీద ఉండే ఈ పదాలతో ఇంజెక్షన్ ఎక్కడ వేయాలో తెలుసుకోవచ్చు.
IV అని ఉంటే నరాలకు, IM- కండరానికి, ID- చర్మం మీద, SC- చర్మం కింది లేయర్‌పై మాత్రమే వేయాలి. IO- బోన్ మ్యారోకి(ప్రాణాపాయ స్థితిలో అవలంభిస్తారు) వేస్తారు.
నోట్: కేవలం సమాచారం కోసమే