News February 6, 2025

HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ

image

ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.

Similar News

News September 16, 2025

మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

image

మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్‌రూమ్‌కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.

News September 16, 2025

HYD: పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? తనిఖీలు..!

image

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ వ్యవహారం సిటీలో కలకలం రేపింది. ప్రైవేట్ స్కూళ్లలో దందా జరుగుతోంటే అధికారులు ఏం చేస్తున్నారో? సిటీలో అసలు ప్రైవేట్ బడులను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ ఇచ్చాం.. అయిపోయింది.. అసలేం జరుగుతోందనే విషయం ఆలోచించడం లేదు. అందుకే ఈ దౌర్భాగ్యం అని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం అంటారు?

News September 16, 2025

HYD: అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్!

image

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని HYD లక్డీకపూల్‌లోని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారని సమాచారం. OCT 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ఈ సంఘం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా వారు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.