News February 6, 2025

HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ

image

ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.

Similar News

News February 6, 2025

శ్రీకాళహస్తి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై కత్తితో దాడి

image

తొట్టంబేడు (మం) కన్నలి ST కాలనీలో బుధవారం రాత్రి కాంతారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. పొయ్యి కొత్తూరుకు చెందిన కాంతారావు కన్నలి ST కాలనీకి చెందిన లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి మధ్య గొడవలు కాగా లావణ్య పుట్టింటికి వచ్చింది. బుధవారం మళ్లీ గొడవపడిన కాంతారావు కత్తితో లావణ్యపై దాడి చేశాడు. అడ్డం వచ్చిన లావణ్య అక్క సుకన్య, చెల్లెలు సుభాషిణిపై దాడి చేశాడు.

News February 6, 2025

నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క

image

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి <<15374769>>నాగేశ్వరరావు మృతి<<>> పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని సహకారాలు అందిస్తామన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

News February 6, 2025

చెర్వుగట్టులో రేపు అగ్ని గుండాలు

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీరముష్టి వంశీయులు మొదట పూజలు నిర్వహించి అగ్ని గుండాల కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. పంటను స్వామికి సమర్పించి అగ్ని గుండాలపై నడిస్తే పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంటామని భక్తుల నమ్మకం.

error: Content is protected !!