News October 10, 2025

HYD: ఫైర్ డిపార్ట్‌‌మెంట్‌లో న్యూ టెక్నాలజీ.!

image

HYD మాదాపూర్, RR జిల్లా హెడ్ క్వార్టర్ ఫైర్ స్టేషన్లను IPS విక్రమ్ సింగ్ తనిఖీలు చేశారు. మంటలు అర్పటం కోసం రోబో జెట్లను సైతం వాడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఫైర్ డిపార్ట్‌‌మెంట్‌‌లో న్యూ టెక్నాలజీ మిళితమైందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. 10ఫ్లోర్ల పైకి తీసుకెళ్లే 54 మీటర్ల బ్రౌన్టో స్కై లిఫ్ట్ అందుబాటులో ఉందన్నారు.

Similar News

News October 10, 2025

దుకాణాలు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేయాలి: అనిల్ కుమార్

image

దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. టపాసులు అమ్మే ప్రదేశంలో దుకాణదారులు ఫైర్, విద్యుత్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలని, తగిన రక్షణలతో అమ్మకాలు కొనసాగించాలని ఆయన సూచించారు.

News October 10, 2025

గ్రూప్-1 ర్యాంకర్‌ను సన్మానించిన HYD కలెక్టర్

image

గ్రూప్-1 ద్వారా ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌గా ధనసిరి దివ్య ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవారం లక్డికాపూల్‌లోని కలెక్టరేట్‌‌లో ఆమెను సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగ సాధన అభినందించి, దివ్యని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

News October 10, 2025

విశాఖ: ‘ధాన్యం సేకరణపై అప్రమత్తంగా ఉండాలి’

image

ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 40 రైతు సేవా కేంద్రాల ద్వారా 10,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. కామన్ రకం క్వింటాకు రూ.2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధరగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1967కి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.