News August 10, 2025

HYD: బంద్ ఉన్నా.. పనిచేస్తున్నందుకు దాడి

image

వేతనాల పెంపు కోసం ఈ నెల 1 నుంచి సినీ కార్మిక యూనియన్లు షూటింగ్స్‌కు బంద్‌ పాటిస్తున్నాయి. గత సోమవారం సారథి స్టూడియోలో ఒక సీరియల్‌కు సంబంధించి కాస్ట్యూమర్‌ యూనియన్‌ ప్రతినిధి సత్యనారాయణ పనిచేస్తుండగా అధ్యక్షుడు శ్రీనివాస్ మరో ముగ్గురు వెళ్లి దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స అనంతరం బాధితుడు ఆదివారం మధురానగర్‌ PSలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Similar News

News January 29, 2026

HYDలో ఎయిర్ క్వాలిటీ @236

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.

News January 29, 2026

ఈ నంబర్లు సేవ్ చేసుకోండి.. HYDలో సేవ్ చేస్తాయి!

image

అత్యవసర సమయాల్లో ఏ సమస్యకు ఏ నంబర్లకు కాల్ చేయాలో మీ కోసం..
☞ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ☞ 102 గర్భిణులు& పిల్లల కోసం ☞ 1073 సిటీలో రోడ్డు ప్రమాదాలు జరిగితే ☞1912 విద్యుత్‌శాఖ ☞1098 చైల్డ్ లేబర్ ☞ 104 హెల్త్ అడ్వైజ్ తీసుకోవడానికి ☞14567 సీనియర్ సిటిజన్స్ సహాయార్థం ☞ 1098 చైల్డ్ లేబర్ ☞ 1033 నేషనల్ హైవేలపై ఎమర్జెన్సీ ఏర్పడితే ర్యాపిడ్ రెస్పాన్స్ ☞ 9440700906 షీ టీమ్స్ ☞ 9000113667 హైడ్రా
# SHARE IT

News January 29, 2026

HYD: ఆదివాసీల ఆరాధ్య దైవం.. కొమురం భీమ్

image

కొమురం భీమ్.. గిరిజనుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన అజేయ విప్లవ వీరుడు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన మహాధీరుడు. ఆదివాసీల స్వయం పాలన కోసం రణభేరి మోగించిన మొనగాడు. ‘జల్, జంగల్, జమీన్ హమారా’ నినాదంతో గోండు గిరిజనుల్లో చైతన్యం రగిలించిన పోరాట యోధుడు. జోడేఘాట్ తిరుగుబాటుతో 12 ఏళ్లు నిజాం సర్కారును వణికించిన ఉద్యమకారుడు. జోడేఘాట్ అడవుల్లో ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన వేగు చుక్క.