News January 3, 2026

HYD: బంధాన్ని బలపరిచే ‘2-2-2 రూల్’

image

ప్రస్తుత బిజీ జీవితంలో ప్రేమకు సమయం దొరకడం దంపతులకు కష్టమవుతోంది. వీరికి ‘2-2-2 రూల్’ కొత్త దారి చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక డేట్‌, 2 నెలలకు ఓ వీకెండ్‌ ప్రయాణం, 2 ఏళ్లకు ఒక దీర్ఘ విహారం కలిసి చేయాలనే ఈ సూత్రం అనుబంధాన్ని బలపరుస్తుంది. కలిసి గడిపే సమయం పెరగడంతో భావోద్వేగ అనుబంధం బలపడుతుందని నిపుణులు బోధిస్తున్నారు. చిన్న ప్రణాళికలతో పెద్ద మార్పు సాధ్యమని సూచిస్తున్నారు.

Similar News

News January 5, 2026

పాకిస్థాన్‌లోని ఉగ్రమూకలను లాక్కురండి: ఒవైసీ

image

ఇండియాలో పలు చోట్ల విధ్వంసం చేసి పాకిస్థాన్‌లో దాక్కున్న ఉగ్రమూకలను అక్కడకెళ్లి లాక్కురావాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. వెనుజులా అధ్యక్షుడినే అమెరికా తీసుకెళ్లినపుడు.. మీరు ఉగ్రవాదులను పాకిస్థాన్ నుంచి ఇక్కడకు తీసుకురాలేరా? అని ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని ప్రశ్నించారు. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులను లాక్కురండి అని పేర్కొన్నారు.

News January 5, 2026

APPLY NOW: AVNL ఉద్యోగాలు

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL)లో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE, BTech, PG, PhD, డిప్లొమా, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 6వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్, Sr.కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,20,000+IDA, Sr. మేనేజర్‌కు రూ.70000+IDA, Jr. మేనేజర్‌కు రూ.30,000+IDA చెల్లిస్తారు.

News January 5, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,580 పెరిగి రూ.1,37,400కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 ఎగబాకి రూ.1,25,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8,000 పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.