News February 26, 2026
HYD: బడా బాబుల ‘కోటల’ గుట్టు రట్టు!

మూసీ సుందరీకరణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు గర్జిస్తున్నా 42 బడా సంస్థల విషయంలో యంత్రాంగం మౌనం వహిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. అంబర్‌పేటలోని ఇంజినీరింగ్ కాలేజీలు, అత్తాపూర్‌లోని మల్టీప్లెక్స్‌లు, నాగోల్‌లోని ఫంక్షన్ హాళ్ల జాబితా సిద్ధమైనా అవి రాజకీయ నేతల బినామీ ఆస్తులు కావడంతో GOVT ఆచితూచి అడుగులేస్తోంది. హైడ్రా మార్కింగ్ చేసినా పెనాల్టీతో రెగ్యులరైజ్ చేసే రహస్య ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం.
Similar News
News February 27, 2026
కన్నీళ్లు పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో <<19251338>>క్లీన్‌చిట్<<>> లభించడంతో అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘కేజ్రీవాల్ తప్పు చేయలేదు. ఆప్ పార్టీ తప్పు చేయలేదు. మోదీ ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు’ అని విమర్శించారు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న సందర్భంగా భార్య, కూతురి ఆనందం అవధులు దాటింది.
News February 27, 2026
HYD: ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి సోదరుడి దాడి

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు కొందరు దుండగులు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివారులోకి పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
News February 27, 2026
నిర్మల్: మార్చి 4 నుంచి ‘సదరం’ క్యాంపులు

జిల్లాలో మార్చి 4వ తేదీ నుంచి 31 వరకు వివిధ కేటగిరీల దివ్యాంగులకు ‘సదరం’ క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని, మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిన వారు మాత్రమే కేటాయించిన కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట అవసరమైన ధ్రువపత్రాలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


