News January 30, 2025
HYD: బడ్జెట్ సమావేశాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

GHMC బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. GHMC బడ్జెట్ నగరాభివృద్ధికి సంబంధించిన అంశమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తోందన్నారు. అవిశ్వాసం పెట్టుకునే హక్కు అందరికీ ఉందని, అవిశ్వాసం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
Similar News
News October 16, 2025
సిరిసిల్ల: జువైనల్ కోర్టును ప్రారంభించిన న్యాయమూర్తి

సిరిసిల్లలో జువైనల్ కోర్టును న్యాయమూర్తి కావేటి సృజన గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ.. బాలల న్యాయ చట్టానికి అనుగుణంగా జిల్లాలో బాలల స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందన్నారు. బోర్డు మెంబర్ శ్రీ రమణ, కళ్యాణ్, చక్రవర్తి, వెంకట్, సంతోష్, శోభన తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.
News October 16, 2025
MBNR: పీయూలో ఘనంగా స్నాతకోత్సవం!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం ఆడిటోరియంలో 4వ స్నాతకోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గురువారం మొత్తం 83 బంగారు పతకాలను పీయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పీయూ ఉపకులపతి(VC) ఆచార్య డాక్టర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సంవత్సరంలో ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.


