News July 8, 2025

HYD: బతుకమ్మ కుంట బతికింది!

image

అంబర్‌పేట‌లోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్‌లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?

Similar News

News July 8, 2025

సత్వర న్యాయం కోసమే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే: SP

image

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు SP మహేష్ బీ గితే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 23 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

News July 8, 2025

దేశంలో తెలుగు మాట్లాడేవారు ఎంత మందో తెలుసా?

image

భారతదేశంలో సుమారు 22 రాజ్యాంగబద్ధ భాషలతో పాటు వేలాది భాషలు వాడుకలో ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది హిందీ భాషనే మాట్లాడుతుంటారు. దేశంలో హిందీని 54కోట్ల మంది మాట్లాడతారని తెలుస్తోంది. ఆ తర్వాత బెంగాలీని 10కోట్ల మంది, మరాఠీని 8.5 కోట్ల మంది, తెలుగును 8.3 కోట్ల మంది మాట్లాడతారని అంచనా వేస్తున్నారు. తమిళం(7.8 కోట్లు), గుజరాతీ(6 కోట్లు), 5.5 కోట్ల మంది ఉర్దూను మాట్లాడుతున్నారు.

News July 8, 2025

ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం శోచనీయం: హరీశ్ రావు

image

ఉపాధి హామీ ఏపీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని “X” వేదికగా డిమాండ్ చేశారు.