News August 31, 2024
HYD: ‘బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపట్టొద్దు’

బఫర్ జోన్‌లో నూతన నిర్మాణాలు చేపడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హైకోర్టు శుక్రవారం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల నడెంచెరువు సమీపంలో 17.21 ఎకరాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చే ముందు నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించింది.
Similar News
News March 9, 2026
HYD: చెత్త కనిపిస్తే వాట్సాప్ చేయండి

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాల దాకా రాకుండానే పారిశుద్ధ్య సమస్యలు తెలియజేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినా, చెత్త బిన్లు నిండిపోయినా, నాలాల్లో వ్యర్థాలు ఉన్నా ఫొటో తీసి, లొకేషన్‌తో వాట్సాప్ నంబర్‌కు పంపాలన్నారు. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
GHMC: 8125966586
మల్కాజిగిరి: 9063421300
సైబరాబాద్: 9063421347
News March 9, 2026
HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2026
HYD: CITD డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్

బాలానగర్‌లోని కేంద్ర టూల్ డిజైనింగ్(CITD) విద్యాసంస్థ డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించింది. కనీసం 10వ తరగతి పాసైన విద్యార్థులు, ఈ కోర్సులు చేయడానికి అర్హులు. టూల్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కోర్సులు ఇందులో ఉన్నాయి. ఒక్కో కోర్సు 3 ఏళ్లు. అప్లికేషన్స్ స్వీకరణ ప్రారంభమైందని, మే 22 వరకు tinyurl.com/citddiploma2026 ద్వారా దరఖాస్తు చేసుకోండి.


