News July 17, 2024
HYD: బర్త్ డే వేడుకలకు వెళ్లి వస్తూ.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHB పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. రణధీశ్ (20) KPHB పరిధిలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మియాపూర్‌లోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో JNTU మెట్రో స్టేషన్ వద్ద పాల వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 19, 2026
కీసరగుట్ట హుండీ ఆదాయం ₹92,70,762

కీసరగుట్టలో 6 రోజులపాటు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. హుండీ ద్వారా ₹92,70,762 ఆదాయం వచ్చిందని ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ, EO సుధాకర్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ ఏడాది 20,801 ఆదాయం పెరిగిందన్నారు. హుండీ లెక్కింపులో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
News February 19, 2026
ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా BRAOU

ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలకు ధీటుగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్ధులు పోటీ పడుతున్నారని వీసీ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తంచేశారు. టీసీఎస్ అయాన్ భాగస్వామ్య కంపెనీల ద్వారా ఎంపికైన 64 మంది అభ్యర్థులకు గురువారం వర్సిటీ ప్రాంగణంలో ఆఫర్ లెటర్లు అందజేశారు. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలకు దీటుగా డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పోటీపడుతుందన్నారు.
News February 19, 2026
HYD: EAPCETకి 3,385 అప్లికేషన్స్

TG EAPCET ప్రవేశ పరీక్షకు సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించి 1,430 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది అప్లై చేయగా 2 విభాగాలకు 5 మంది దరఖాస్తు చేసుకోవడంతో 3,385 అప్లికేషన్ వచ్చాయని TG EAPCET కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి JNTUHలో వెల్లడించారు.


