News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.

Similar News

News December 27, 2025

HYD: మూసీ కింద ‘Secret’ నది

image

మూసీలో చుక్క మురుగు పడకుండా భూమికి 25 అడుగుల లోతులో లండన్ రేంజ్ భారీ సొరంగాలు తవ్వబోతున్నారనేది నగరంలో హాట్ టాపిక్. పైన నీళ్లు పారుతుంటే, కింద సైలెంట్‌గా మురుగు సిటీ దాటి వెళ్లిపోయేలా ఇన్విజిబుల్ డ్రైనేజీ ప్లాన్ రెడీ అవుతోంది. వినడానికి ఇది హాలీవుడ్ సినిమా సెట్టింగ్‌లా ఉన్నా మూసీ ఫ్యూచర్ ఇదేనట. HYD కంపు కొట్టే రోజులు పోయి.. కళ్లు చెదిరే రేంజ్‌లో మెరిసిపోవడం ఖాయమని అధికారులు Way2Newsకు తెలిపారు.

News December 27, 2025

HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

image

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News December 27, 2025

HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

image

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.